Homeన్యూస్గని ప్రపంచంలో ఉన్నది వీరే!

గని ప్రపంచంలో ఉన్నది వీరే!

గని ప్రపంచంలో ఉన్నది వీరే!
గని ప్రపంచంలో ఉన్నది వీరే!

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ పరంగా సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తోన్న చిత్రం గని. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు. రీసెంట్ గా విడుదల చేసిన గని ఆల్బమ్ కు సూపర్బ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు గని ప్రపంచాన్ని పరిచయం చేసారు నిర్మాతలు.

గనిలో కీలక పాత్రల్లో నటిస్తోన్న వారిని ఈ వీడియోలో పరిచయం చేసారు. వరుణ్ తేజ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. నదియా, నరేష్, తనికెళ్ళ భరణి, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్రలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు టీజర్ అప్డేట్ ను కూడా ఇచ్చారు. నవంబర్ 15న టీజర్ విడుదలవుతున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు బాబీ, సిద్దు ముద్దా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 3న విడుదల తేదీ ప్రకటించినా కానీ అది 9కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా డిసెంబర్ లోనే గని రానుంది. ఈ సినిమాకోసం వరుణ్ తేజ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

Also Read:

చిన్న గని గా మెప్పిస్తోన్న అల్లు అయాన్
అది తప్ప గని ఫుల్ సెట్!!
గని ఫస్ట్ పంచ్: దెబ్బ అదుర్స్ కదూ!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All