Homeటాప్ స్టోరీస్గని ఫస్ట్ పంచ్: దెబ్బ అదుర్స్ కదూ!

గని ఫస్ట్ పంచ్: దెబ్బ అదుర్స్ కదూ!

గని ఫస్ట్ పంచ్: దెబ్బ అదుర్స్ కదూ!
గని ఫస్ట్ పంచ్: దెబ్బ అదుర్స్ కదూ!

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ను జాగ్రత్తగా  ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎఫ్2, గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో చిత్రాన్ని ఎంచుకున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నాడు. దీనికి గని అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. కరోనా కారణంగా ఈ చిత్రం పలు  మార్లు షూటింగ్ వాయిదా పడి చివరికి పూర్తి చేసుకుంది.

ఇక కొద్దిసేపటి క్రితం గని ఫస్ట్ పంచ్ ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ పంచ్ అదిరిందనే చెప్పాలి. టీజర్ కు ఫస్ట్ పంచ్ అని ప్రమోషన్స్ కోసం పేరు పెట్టారు. గని ఫస్ట్ పంచ్ లో ప్రధానంగా హైలైట్ అయింది వరుణ్ తేజ్ లుక్స్. ఒక బాక్సర్ కు ఉండాల్సిన ఫిజిక్ తో వరుణ్ తేజ్ అదరగొట్టాడు. చాలా ఫియర్స్ గా ఉంది వరుణ్ తేజ్ లుక్. బాక్సింగ్ రింగ్ లో ఎవరికో పిడిగుద్దుల వర్షం కురిపిస్తున్నాడు.

- Advertisement -

ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ ఫస్ట్ పంచ్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ గా నిలిచింది. టీజర్ తోనే దుమ్ము దులిపాడు థమన్. అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సిద్దు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. సాయీ మంజ్రేకర్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర గనిలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే గని చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All