Homeటాప్ స్టోరీస్చిన్న గని గా మెప్పిస్తోన్న అల్లు అయాన్

చిన్న గని గా మెప్పిస్తోన్న అల్లు అయాన్

చిన్న గని గా మెప్పిస్తోన్న అల్లు అయాన్
చిన్న గని గా మెప్పిస్తోన్న అల్లు అయాన్

మెగా హీరో వరుణ్ తేజ్ నుండి వస్తోన్న తాజా చిత్రం గని. పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ టైటిల్ పాత్రలో బాక్సర్ గా కనిపించనున్నాడు. డిసెంబర్ మొదటి వారంలో గని విడుదల కానుంది. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ, సిద్దు ముద్దా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే గని చిత్రాన్ని ప్రమోట్ చేసే బాధ్యతను అల్లు అయాన్ తీసుకున్నాడు.

అల్లు అయాన్ కోరినట్లుగా తన పెదనాన్న అల్లు బాబీ ఒక వీడియోను రూపొందించాడు. అల్లు అర్జున్ ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, “అల్లు అయాన్, నీకు ప్రామిస్ చేసినట్లుగా నీ పెదనాన్న తన మొదటి సినిమాలో ఒక వీడియోను చేసాడు. అల్లు అయాన్ చేసిన దే కాల్ హిమ్ గని. అల్ ది బెస్ట్ టు గని టీమ్” అని అల్లు అర్జున్ పోస్ట్ చేసాడు.

- Advertisement -

ఇక వీడియోలో అల్లు అయాన్ ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తూ నిజంగా గని అనిపించుకోవడానికి చెమటలు చిందిస్తున్నాడు. అయితే అయాన్ చేసిన ఈ వీడియో క్యూట్ క్యూట్ గా భలే ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అప్పుడే తమ నెక్స్ట్ స్టార్ అంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All