Homeన్యూస్రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న గుడ్ లక్ సఖి

రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న గుడ్ లక్ సఖి

రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న గుడ్ లక్ సఖి
రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న గుడ్ లక్ సఖి

మహానటి సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో పలు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు వచ్చాయి. పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు నిరాశపర్చగా ఇప్పుడు గుడ్ లక్ సఖి విడుదల కాబోతోంది. ఈ సినిమా గత కోనేళ్ళుగా ప్రొడక్షన్ దశలో ఉంది. కీర్తి సురేష్ హీరోగా రూపొందించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఆమె షూటర్ పాత్రను పోషిస్తోంది.

జగపతి బాబు కీర్తి సురేష్ కోచ్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి మరో కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఒక పల్లెటూరి నుండి వచ్చిన సాదాసీదా అమ్మాయి తను ఇష్టపడ్డ క్రీడలో ఎలా కష్టాలను అధిగమించి సక్సెస్ సాధించిందనే పాయింట్ మీద ఈ చిత్రం తెరకెక్కింది. గుడ్ లక్ సఖి విడుదల విషయంలో నిర్మాతలు పలు మార్లు తమ ఆలోచనను మార్చుకున్నారు.

- Advertisement -

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో గుడ్ లక్ సఖి చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయాలని భావించారు. ఇందుకు సంబంధించిన డీల్స్ పూర్తయినా ఇప్పుడు మళ్ళీ థియేట్రికల్ రిలీజ్ వైపు మొగ్గు చూపారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర రిలీజ్ డేట్ ఖరారైంది. గుడ్ లక్ సఖి చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిన గుడ్ లక్ సఖి చిత్రాన్ని దిల్ రాజు సమర్పిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All