Homeగాసిప్స్కీర్తి సురేష్ @ 3 కోట్లు..!

కీర్తి సురేష్ @ 3 కోట్లు..!

మహానటి తర్వాత కీర్తి సురేష్ పాపులారిటీ పెరిగినా అందుకు తగిన పాత్రలు మాత్రం పడలేదని చెప్పాలి. తెలుగులో కొన్ని ప్రయోగాలు వికటించిన తర్వాత మళ్లీ స్టార్ హీరోల సరసన నటిస్తున్న అమ్మడు అటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. ఇక లేటెస్ట్ గా నాచురల్ స్టార్ నాని దసరా సినిమాలో లక్కీ ఛాన్స్ అందుకుంది కీర్తి సురేష్. శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. దసరా రోజున రిలీజ్ చేసిన స్నీక్ పీక్ లో బతుకమ్మ సాంగ్.. ట్రైన్ రాబరీ ఇవన్ని చూపించారు.

- Advertisement -

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా నాని కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా వస్తుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను కీర్తి సురేష్ కు అక్షరాల 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. సౌత్ లో 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్స్ ఖాతాలో కీర్తి సురేష్ కూడా చేరింది. సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. టీజర్ లో జస్ట్ లుక్స్ తోనే షాక్ ఇచ్చిన కీర్తి సురేష్ ఈ సినిమాతో ఎలా సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.

నాని కూడా అంటే సుందరానికీ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా చేస్తుంటే.. ఈ దసరా సినిమా సీరియస్ సబ్జెక్ట్ తో వస్తుందని తెలుస్తుంది. నాని మొదటిసారి తెలంగాణా యాసలో మాట్లాడుతూ చేస్తున్న సినిమా ఇదే అవడం విశేషం.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All