
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటడానికి ఫిక్స్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తోన్న భీమ్లా నాయక్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ కు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.
భీమ్లా నాయక్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు చిత్రాన్ని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. సంక్రాంతికి భీమ్లా నాయక్ కు భారీ పోటీ ఉండనుంది. ముందు ఆర్ ఆర్ ఆర్, వెనుక రాధే శ్యామ్ చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. ఆ రెండూ కూడా ప్యాన్ ఇండియన్ సినిమాలు కావడం విశేషం.
అయితే భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ బిజినెస్ పై దీని ఎఫెక్ట్ అస్సలు పడలేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఈ చిత్రం ఏకంగా 95 కోట్లకు వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ ను పూర్తి చేసుకుంది. సంక్రాంతి పోటీ, ఏపీలో టికెట్ల ఇష్యూ ఇవేవీ కూడా చిత్ర ప్రీరిలీజ్ పై ఎఫెక్ట్ చూపించలేదు.
సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
ఇవి కూడా చదవండి:
భీమ్లా నాయక్ సెకండ్ సాంగ్ అప్డేట్..!
డేనియల్ శేఖర్ గా రానా దగ్గుబాటి అదుర్స్ అంతే
భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్: కచ్చితంగా రికార్డులు గాయబ్
భీమ్లా నాయక్: తగ్గేదేలే అంటోన్న పవన్ కళ్యాణ్