Homeన్యూస్భీమ్లా నాయక్ సెకండ్ సాంగ్ అప్డేట్..!

భీమ్లా నాయక్ సెకండ్ సాంగ్ అప్డేట్..!

Powerstar Pawan Kalyan Bheemla Nayak Second Song Update Poster
  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దగ్గుబాటు రానా కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. సాగర్ చంద్ర డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రం మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యా మీనన్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భీమ్లా నాయక్ నుండి ఇప్పటికే టైటిల్ సాంగ్ రిలీజ్ అవగా సెకండ్ సాంగ్ రిలీజ్ అప్డేట్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నారు.

అక్టోబర్ 15 దసరా సందర్భంగా భీమ్లా నాయక్ నుండి సెకండ్ సాంగ్ అంత ఇష్టం రాబోతుంది. ఈ సాంగ్ పవన్, నిత్యా మీనన్ ల మధ్య ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సాంగ్ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ తో వచ్చిన పవన్, నిత్యా మీనన్ ల పోస్టర్ సూపర్ గా ఉంది. ఆల్రెడీ పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన థమన్ భీమ్లా నాయక్ కు అంతకుమించి మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

పవన్ తో పాటుగా రానాకి ఈ సినిమాలో మంచి రోల్ పడినట్టు తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2022 జనవరి 12న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All