
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న నెక్స్ట్ సినిమా భీమ్లా నాయక్. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. రానా దగ్గుబాటి భీమ్లా నాయక్ లో మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొదటి సింగిల్ ను విడుదల చేసారు.
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను విడుదల చేయగా మరోసారి ఎస్ ఎస్ థమన్ తన ఫామ్ ను కొనసాగించాడు. చార్ట్ బస్టర్ సాంగ్ ను దంచి కొట్టాడు. ఆ బీట్, క్యాచీ ట్యూన్ అదిరింది. ఇక ఈ సాంగ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం గురించి. అటు క్యాచీ ఫ్రెజ్ లు వాడుతూ పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్ ను కూడా ప్రతిబింబించేలా సాహిత్యం అందించాడు.
సాయి కృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిరియాల ఈ సాంగ్ కు మరింత వన్నె తెచ్చారు. తప్పకుండా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రికార్డులను తుడిచిపెట్టేయడం ఖాయం. జనవరి 12 2022న ఈ చిత్రం విడుదల కానుంది.