
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తోన్న భీమ్లా నాయక్ పై సూపర్బ్ బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో నుండి విడుదలైన పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. ఇక రానా దగ్గుబాటి మరో లీడ్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోశియుమ్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది.
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మొదట నిర్మాతలు ప్రకటించారు. అయితే రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ జనవరి 7కి రిలీజ్ కానుండడం, ప్రభాస్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ జనవరి 14న విడుదలకు సిద్ధమవడంతో భీమ్లా నాయక్ వాయిదా పడుతుంది అనుకున్నారందరూ. నిజానికి మహేష్ బాబు సర్కారు వారి పాటను జనవరి 13న విడుదల చేద్దామని ప్లాన్ చేయగా వెనక్కి తగ్గాడు.
ఇదే తరహాలో భీమ్లా నాయక్ కూడా మరో డేట్ చూసుకుంటుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ చిత్ర నిర్మాతలు తమ సినిమా అనుకున్న తేదీకి విడుదలవుతుందని చెబుతూ వస్తున్నారు. రీసెంట్ గా వాయిదా రూమర్స్ పెరిగిపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి పూర్తి క్లారిటీ ఇచ్చింది. జనవరి 12న తమ సినిమా ఎట్టి పరిస్థితుల్లో విడుదలవుతుందని కచ్చితంగా చెప్పేసింది. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ సంభాషణలు అందించాడు.
ఇవి కూడా చదవండి:
భీమ్లా నాయక్ నుండి నాగ్ కు హింట్ అందిందా?
భీమ్లా నాయక్: రానా సరసన మలయాళీ భామ
కొత్త డేట్ చూసుకుంటోన్న భీమ్లా నాయక్!!
భీమ్లా నాయక్ అంత ఇష్టం లిరికల్: థమన్ ఖాతాలో మరో చార్ట్ బస్టర్