
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. మలయాళంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో లీడ్ రోల్ ను పోషిస్తున్నాడు.
రానా దగ్గుబాటి డేనియల్ శేఖర్ గా కనిపించనుండగా తన పాత్రకు సంబంధించిన వీడియో కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఇందులో రానా దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ ను ఢీ కొట్టే పాత్రలో కనిపించనున్నట్లు అర్ధమవుతోంది. “నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట. స్టేషన్ లో టాక్ నడుస్తోంది.
నేనెవరో తెలుసా? ధర్మేంద్ర. హీరో”, “డేనియల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెం 1” ఈ డైలాగ్స్ బట్టి ఇద్దరికీ ఇగో క్లాషెస్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని తెలుస్తోంది. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసాడు.
