Homeటాప్ స్టోరీస్డిసెంబర్ అంతా సినిమాల కళకళ!!

డిసెంబర్ అంతా సినిమాల కళకళ!!

డిసెంబర్ అంతా సినిమాల కళకళ!!
డిసెంబర్ అంతా సినిమాల కళకళ!!

సాధారణంగా క్రిస్మస్ వీకెండ్ తప్పితే డిసెంబర్ అంతా కూడా ఆఫ్ సీజన్ గానే పరిగణిస్తారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పెద్దగా సినిమాలు విడుదల కాలేదు కాబట్టి డిసెంబర్ లో పలు భారీ చిత్రాలు డిసెంబర్ లో విడుదలవుతున్నాయి. నవంబర్ లో ప్రస్తుతం సినిమాల సందడి తక్కువగానే ఉంది. ఇక డిసెంబర్ 2న బాలకృష్ణ అఖండతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గేట్లు ఎత్తడానికి సిద్ధమవుతున్నాడు. అఖండ ట్రైలర్ తో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు బాలయ్య ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.

ఆ తర్వాత డిసెంబర్ 10న కీర్తి సురేష్ చిత్రం గుడ్ లక్ సఖి విడుదల కానుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. డిసెంబర్ 17న మరో భారీ చిత్రం విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తోన్న ప్యాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ భారీ ఎత్తున ఆ రోజు విడుదలవుతుంది.

- Advertisement -

ఇక క్రిస్మస్ వీకెండ్ లో నాని శ్యామ్ సింగ రాయ్ తో వరుణ్ తేజ్ గనితో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 3న విడుదల కావాల్సిన గని ఇప్పుడు 24కి వాయిదా పడింది. అయితే ఆ డేట్ నుండి కూడా వాయిదా పడుతుందని అంటున్నారు. ఇద్దరు మెగా హీరోల చిత్రాలు వారం గ్యాప్ లో రావడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి:

పుష్ప: సమంత రెమ్యునరేషన్ వింటే మతి పోవాల్సిందే

పుష్పకు డేట్స్ ఇచ్చిన సమంత

మరోసారి వాయిదా పడ్డ గుడ్ లక్ సఖి

శ్యామ్ సింగ రాయ్: నాని వెనక్కి తగ్గుతాడా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All