Homeటాప్ స్టోరీస్మరోసారి వాయిదా పడ్డ గుడ్ లక్ సఖి

మరోసారి వాయిదా పడ్డ గుడ్ లక్ సఖి

మరోసారి వాయిదా పడ్డ గుడ్ లక్ సఖి
మరోసారి వాయిదా పడ్డ గుడ్ లక్ సఖి

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన స్పోర్ట్స్ డ్రామా గుడ్ లక్ సఖి. నవంబర్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు గుడ్ లక్ సఖి విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. కారణం తెలియదు కానీ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఒక స్టేజ్ లో ఓటిటిలో విడుదల చేయడానికి కూడా సన్నాహాలు చేసారు. చివరికి థియేటర్లకు ఓటు వేయగా ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ వచ్చింది.

డిసెంబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. డిసెంబర్ 2న బాలకృష్ణ అఖండ, డిసెంబర్ 17న పుష్ప ది రైజ్ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ రెండు భారీ చిత్రాల మధ్యలో గుడ్ లక్ సఖిని విడుదల చేయాలనుకుంటున్నారు. నగేష్ కకునూర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

- Advertisement -

ఈ స్పోర్ట్స్ డ్రామాలో కీర్తి సురేష్ కోచ్ గా జగపతి బాబు నటించాడు. ఆది పినిశెట్టి థియేటర్ ఆర్టిస్ట్ రోల్ ను పోషించాడు. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పిస్తున్నారు. మరి గుడ్ లక్ సఖి నిజంగానే నిర్మాతలకు గుడ్ లక్ ను తీసుకొస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న గుడ్ లక్ సఖి

‘అఖండ’తో శ్రీకాంత్ కు కొత్త లైఫ్ వస్తుందా?

సర్కారు వారి పాట కోసం వయోలానిస్ట్ గా మారనున్న కీర్తి సురేష్

మరో ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ లో నటించనున్న కీర్తి సురేష్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All