Homeఎక్స్ క్లూసివ్పుష్పకు డేట్స్ ఇచ్చిన సమంత

పుష్పకు డేట్స్ ఇచ్చిన సమంత

పుష్పకు డేట్స్ ఇచ్చిన సమంత
పుష్పకు డేట్స్ ఇచ్చిన సమంత

తన కెరీర్ లో మొదటిసారి సమంత స్పెషల్ సాంగ్ చేస్తోంది. తన పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకుల కారణంగా సమంత సినిమాల నుండి కొంత బ్రేక్ తీసుకున్న విషయం తెల్సిందే. శాకుంతలంతో పాటు ఒక తమిళ చిత్రాన్ని పూర్తి చేసిన సమంత రెండు తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాలను చేయనుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ త్వరలోనే మొదలవుతాయి. కానీ దానికంటే ముందు స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది సామ్.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పుష్పలో స్పెషల్ సాంగ్ చేయడానికి సమంతను అప్రోచ్ అయ్యారు. ముందు బాలీవుడ్ హీరోయిన్ ను అనుకున్నా కానీ వర్కౌట్ కాకపోవడంతో సమంతను ఛూజ్ చేసుకున్నారు. భారీ రెమ్యునరేషన్ ముట్టజెప్పి సామ్ డేట్స్ ను కూడా తీసుకున్నారు. నవంబర్ మూడో వారం నుండి ఈ సాంగ్ షూటింగ్ మొదలవుతుంది.

- Advertisement -

సుకుమార్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అవుతాయి. రంగస్థలంలో కూడా జిగేలు రాణి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెల్సిందే. పుష్ప ది రైజ్ లో కూడా అదిరిపోయే ట్యూన్ ను దేవి శ్రీ ప్రసాద్ సిద్ధం చేసాడట. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్ 17న మొత్తం ఐదు భాషల్లో పుష్ప ది రైజ్ విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

పుష్ప నాలుగో సింగిల్ అప్డేట్ కూడా వచ్చేసింది

పుష్ప హిందీ వెర్షన్ విషయంలో రిస్క్ చేస్తున్నారా?

పుష్పక విమానం టైటిల్ పర్మిషన్ సింగీతంను అడిగితే…

పుష్ప: దాక్షాయణిగా షాక్ ఇచ్చిన అనసూయ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All