Homeటాప్ స్టోరీస్ఎవరు మీలో కోటీశ్వరులు: మహేష్ గెలుచుకుంది ఎంత?

ఎవరు మీలో కోటీశ్వరులు: మహేష్ గెలుచుకుంది ఎంత?

ఎవరు మీలో కోటీశ్వరులు: మహేష్ గెలుచుకుంది ఎంత?
ఎవరు మీలో కోటీశ్వరులు: మహేష్ గెలుచుకుంది ఎంత?

రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు జెమినీ టివిలో ప్రసారమవుతోన్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆగస్ట్ నుండి ఈ షో నిర్విరామంగా కొనసాగుతోంది. కేవలం వీక్ డేస్ లో మాత్రమే నడిచే ఈ షో కు ప్రారంభంలో రేటింగ్స్ బాగా వచ్చినా కానీ నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చాయి. అయినా కానీ నిర్వాహకులు ఈ సీజన్ ను అనుకున్న సమయానికే పూర్తి చేస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షో కు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరైన విషయం తెల్సిందే.

రామ్ చరణ్ గెస్ట్ గా మొదలైన ఈ షో కు కొరటాల శివ, రాజమౌళి, సమంత, థమన్, దేవి శ్రీ ప్రసాద్ వంటి వారు హాజరయ్యారు. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా షో కు స్పెషల్ గెస్ట్ గా విచ్చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. స్పెషల్ గెస్ట్ గా మహేష్ ప్రోమోను విడుదల చేయగా దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

అలాగే ఈ ఎపిసోడ్ ను డిసెంబర్ 2న టెలికాస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చారిటీ కోసమే అయినా ఈ ఎపిసోడ్ లో మహేష్ ఎంత గెలుచుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం మహేష్ 25 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: 

మహేష్ సినిమాలో సామ్?

గూస్ బంప్స్ ప్రోమో వచ్చేసింది.. EMKలో మహేష్, ఎన్.టి.ఆర్..!

రాజమౌళి, మహేష్ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All