
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ సంగీత దర్శకులు ఎవరంటే కచ్చితంగా అందరి వద్ద నుండి వచ్చే సమాధానం దేవి శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ థమన్. వీరిద్దరిలో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్ అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఇద్దరూ కలిసి షో లో సందడి చేయబోతున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ఎవరో మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి ఈ టాప్ సంగీత దర్శకులు స్పెషల్ గెస్ట్ లుగా విచ్చేసారు. ఈ ఎపిసోడ్ గురువారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు దీపావళి సందర్భంగా టెలికాస్ట్ కానుంది.
ఈ ఎపిసోడ్ ప్రోమో చూస్తుంటే ఇద్దరు టాప్ సంగీత దర్శకుల మధ్య మంచి ర్యాపొ ఉన్న విషయం తెలుస్తోంది. వీరిద్దరికీ ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉంది. మెజారిటీ ఎన్టీఆర్ చిత్రాలకు వీరిద్దరే సంగీతం అందించారు కాబట్టి ఈ ముగ్గురి కలయికలో వస్తోన్న ఈ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉండే అవకాశముంది.
ఇప్పటికే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ను పూర్తి చేసారు. ఇప్పటివరకూ షో లో స్పెషల్ గెస్ట్ లుగా రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంత వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఎపిసోడ్ ను షూట్ చేసారు. అయితే అది ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారన్నది ఇంకా రివీల్ చేయలేదు.