Homeటాప్ స్టోరీస్లవ్ స్టోరీపై ప్రశంసల వర్షం కురిపించిన మహేష్ బాబు

లవ్ స్టోరీపై ప్రశంసల వర్షం కురిపించిన మహేష్ బాబు

లవ్ స్టోరీపై ప్రశంసల వర్షం కురిపించిన మహేష్ బాబు
లవ్ స్టోరీపై ప్రశంసల వర్షం కురిపించిన మహేష్ బాబు

లవ్ స్టోరీ చిత్ర ప్రభంజనం కొనసాగుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవిలు జంటగా నటించిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలను సాధించడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా సూపర్ హిట్ అనిపించుకుంటోంది. యూఎస్ లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్క్ ను దాటి మిలియన్ డాలర్స్ వైపు పరుగులు తీస్తోంది.

సెలబ్రిటీలు అందరూ లవ్ స్టోరీ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు లవ్ స్టోరీ చిత్రాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపించాడు. “శేఖర్ కమ్ముల అన్ని ఎమోషన్స్ ను సరిగా రాబట్టాడు. నాకౌట్ ఫిల్మ్ ను అందించాడు. నాగ చైతన్య పెర్ఫార్మన్స్ సూపర్బ్. తన కెరీర్ ను మార్చే పెర్ఫార్మన్స్. సాయి పల్లవి ఎప్పటిలానే సెన్సేషనల్.

- Advertisement -

ఆమెకు అసలు ఎముకలు ఉన్నాయా అన్నట్లు యంస్ చేస్తుంది. ఆమెలా డ్యాన్స్ చేసే వ్యక్తిని నేను ఆన్ స్క్రీన్ పై చూడలేదు. సంగీత దర్శకుడు పవన్ గురించి మీరు చాలా వింటారు. ఎంత మంచి సంగీతం అందించాడు. రహ్మాన్ శిష్యుడు అని విన్నాను, రహ్మాన్ సర్, మీరు అతణ్ణి చూసి గర్వపడతారు. నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, ఏషియన్ సునీల్ లకు కంగ్రాట్స్. ఈ పరిస్థితుల్లో అవసరమైన సక్సెస్ ఇది” అని మహేష్ ట్వీట్ చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All