Homeటాప్ స్టోరీస్నాగ చైతన్య: ఆ వార్తల్లో నిజం లేదు

నాగ చైతన్య: ఆ వార్తల్లో నిజం లేదు

నాగ చైతన్య: ఆ వార్తల్లో నిజం లేదు
నాగ చైతన్య: ఆ వార్తల్లో నిజం లేదు

అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్ లో నటించిన లవ్ స్టోరీ రేపు భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రామిసింగ్ గా ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుండడం, శేఖర్ కమ్ముల దర్శకుడు కావడం కూడా ఈ బజ్ కు ప్రధాన కారణం. ఇక నాగ చైతన్య చిత్రం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఈరోజు లవ్ స్టోరీ రిలీజ్ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. చిత్రం గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. “లవ్ స్టోరీ రియలిస్టిక్ లవ్ స్టోరీ, ఇందులో తక్కువ కులం వ్యక్తిగా కనిపిస్తాను, తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం కోసం కష్టపడ్డాను. శేఖర్ కమ్ముల గారి సహకారంతో కుదిరింది. ఇక ఈ చిత్ర క్లైమాక్స్ విషయంలో శేఖర్ గారు రెండు క్లైమాక్స్ లు అనుకున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. దీనికి ఒకటే ఎండింగ్ ఉంది. దాన్నే చిత్రీకరించారు. ఆ వార్తల్లో నిజం లేదు.”

- Advertisement -

“విక్రమ్ కె కుమార్ వెబ్ సిరీస్ లో నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. డిసెంబర్ నుండి మొదలవుతుంది. ఆమిర్ ఖాన్ తో నటించడం పట్ల సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో మంచి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వస్తే కచ్చితంగా చేస్తాను” అని చైతన్య అన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All