సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే.. తెర ఏదైనా ఈ ఇద్దరు కలిశారంటే రికార్డులు బద్ధలే. తారక్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ వచ్చారు. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా మహేష్ గెస్ట్ గా ఈ షో జరిగింది. స్పెషల్ ఎపిసోడ్ గా ఈ.ఎం.కే ఎపిసోడ్ టెలికాస్ట్ కు సిద్ధం చేస్తుంది. ఇక దీనికి సంబందించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది.
వెల్కం మహేష్ అన్నా అంటూ తారక్.. నీ కన్నా గురువుగారే బెటర్ అన్న మహేష్ ఇలా సరదా సంభాషణలతో ఈ ఎపిసోడ్ నడిచిందని అనిపిస్తుంది. మహేష్ తో ఎన్.టి.ఆర్ ముచ్చట్లు ఎపిసోడ్ కు హైలెట్ కానున్నాయి. ఈ ఎపిసోడ్ లో మహేష్ పాతిక లక్షలు గెలుచుకున్నట్టు తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా ఈ.ఎం.కే తొలి ఎపిసోడ్ చరణ్ తో మొదలవగా మహేష్ తో సీజన్ ముగించేస్తున్నారు.
మొత్తానికి ఈ.ఎం.కే షో ద్వారా మహేష్, ఎన్.టి.ఆర్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ను అలరించనున్నారు. కొద్దిసేపటి క్రితం రిలీజైన ఈ ఎపిసోడ్ ప్రోమో అందరిని అలరిస్తుంది. మరి ఈ.ఎం.కే స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో మీద మీరు ఓ లుక్కేయండి..
