Homeటాప్ స్టోరీస్లైగర్ తో లెజండ్ ఫేస్ టు ఫేస్

లైగర్ తో లెజండ్ ఫేస్ టు ఫేస్

లైగర్ తో లెజండ్ ఫేస్ టు ఫేస్
లైగర్ తో లెజండ్ ఫేస్ టు ఫేస్

క్రేజ్ పరంగా యువ హీరోల్లో టాప్ ఫామ్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. తన రీసెంట్ సినిమాలు నిరాశపరిచినా కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. విజయ్ నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడు.  పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. లైగర్ షూటింగ్ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది.

ప్రస్తుతం యూఎస్ లో షూటింగ్ సాగుతోంది. బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు అధికారికంగా తెలియజేసిన విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం మైక్ టైసన్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మైక్ టైసన్ తో దిగిన ఫోటోను షేర్ చేసి “లైగర్ వెర్సస్ లెజండ్. మైక్ టైసన్ తో ఫేస్ టు ఫేస్” అని విజయ్ ట్వీట్ చేసాడు.

- Advertisement -

ఈ షెడ్యూల్ లో బాక్సింగ్ నేపథ్యంలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

లాస్ వేగాస్ లో చిల్ అవుతోన్న ‘లైగర్’ బాయ్స్

విజయ్ మాస్ డ్యాన్స్.. ముంబైలో లైగర్ సాంగ్ షూట్..!

మ్యాసివ్ అప్డేట్: లైగర్ లో బాక్సింగ్ కింగ్!!

లైగర్ టీమ్ కు సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All