Homeగాసిప్స్భీమ్లా నాయక్ టీజర్ వచ్చేది అప్పుడేనా?

భీమ్లా నాయక్ టీజర్ వచ్చేది అప్పుడేనా?

భీమ్లా నాయక్ టీజర్ వచ్చేది అప్పుడేనా?
భీమ్లా నాయక్ టీజర్ వచ్చేది అప్పుడేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తోన్న సినిమా భీమ్లా నాయక్. మలయాళం సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. రానా దగ్గుబాటి ఈ సినిమాలో మరో ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2022న విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ ప్రమోషన్స్ కూడా ఫుల్ ఫ్లో లో కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ నుండి మరొక టీజర్ రానుందని సమాచారం. డిసెంబర్ 14న రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రానా డేనియల్ శేఖర్ గా కనిపిస్తాడు. పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ భీమ్లా నాయక్ ను భారీ ఎత్తున నిర్మిస్తోన్న విషయం తెల్సిందే.

ఇవి కూడా చదవండి:

భీమ్లా నాయక్ కు త్రివిక్రమ్ పారితోషికం: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

భీమ్లా నాయక్ నుండి నాగ్ కు హింట్ అందిందా?

భీమ్లా నాయక్ అంత ఇష్టం లిరికల్: థమన్ ఖాతాలో మరో చార్ట్ బస్టర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All