Homeన్యూస్భీమ్లా నాయక్ అంత ఇష్టం లిరికల్: థమన్ ఖాతాలో మరో చార్ట్ బస్టర్

భీమ్లా నాయక్ అంత ఇష్టం లిరికల్: థమన్ ఖాతాలో మరో చార్ట్ బస్టర్

భీమ్లా నాయక్ అంత ఇష్టం లిరికల్: థమన్ ఖాతాలో మరో చార్ట్ బస్టర్
భీమ్లా నాయక్ అంత ఇష్టం లిరికల్: థమన్ ఖాతాలో మరో చార్ట్ బస్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళం రిమేక్ అయ్యప్పనుమ్ కోషియుమ్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భీమ్లా నాయక్ ను టైటిల్ గా ఫిక్స్ చేసారు. ఇప్పటికే రెండు ప్రమోలు కూడా విడుదల చేయగానే సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఇక భీమ్లా నాయక్ ఫస్ట్ సాంగ్ కు అయితే ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో మనం చూసాం.

ఈరోజు దసరా సందర్భంగా భీమ్లా నాయక్ నుండి సెకండ్ సింగిల్ ను విడుదల చేసారు. అంత ఇష్టం సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదల కాగా ఇది పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ ల మధ్య సాగుతుంది. తన భర్త తన మీద కురిపించే ప్రేమకు ముగ్దరాలై ఈ పాట పాడే సందర్భం.
లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర ఈ పాటను పాడిన విధానం మనల్ని పులకింప చేస్తుంది. అలాగే ఎస్ ఎస్ థమన్ ఒక సింపుల్ అండ్ అట్రాక్టివ్ ట్యూన్ ను అందించాడు. థమన్ మాములు ఫామ్ లో లేడన్న విషయం ఈ పాటతో మరోసారి అర్ధమవుతుంది. రామాజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా చాలా సింపుల్ గా బాగుంది. మొత్తానికి మరోసారి కచ్చితంగా వినాలనిపించే పాట ఇది.
సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా రానా దగ్గుబాటి మరో కీలక పాత్రను పోషిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All