
రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ గురించి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీకి సపోర్ట్ గా ఉంటున్న మంచు మోహన్ బాబు మీద పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. మీ శ్రీవిద్యా నికేతన్ స్కూల్ ఫీజులు కూడా ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ చేస్తుంది.. ఇప్పుడు ఇండస్ట్రీకి పట్టిన పరిస్థితి రేపు మీకు ఎదురవుతుంది అని అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యలకు మోహన్ బాబు స్పందించారు. మా ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా ఇప్పుడు కాదు అక్టోబర్ 11న డియర్ పవన్ నీకు సమాధానం ఇస్తా అని అన్నారు.
అయితే అక్టోబర్ 11 వచ్చింది.. అనుకున్నట్టుగానే మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా గెలిచారు. ఇప్పుడు అందరు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు మోహన్ బాబు ఎలా రెస్పాండ్ అవుతారా అని ఎదురుచూస్తున్నారు. కావాలనే పవన్ తన ప్రస్థావన తెచ్చారని అని చెబుతాడా లేక పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.
మా ఎలక్షన్స్ రిజల్ట్స్ అనంతరం మంచు విష్ణు గెలుపుని స్వాతగిస్తున్నా అంటూనే ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరో పక్క మెగా బ్రదర్ నాగ బాబు కూడా మా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరి ఈ గొడవ ఎలా టర్న్ అవుతుంది అన్నది చూడాలి.