Homeటాప్ స్టోరీస్రామ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్... మరికొంత కాలం వెయిటింగ్ తప్పదా?

రామ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్… మరికొంత కాలం వెయిటింగ్ తప్పదా?

రామ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్... మరికొంత కాలం వెయిటింగ్ తప్పదా?
రామ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్… మరికొంత కాలం వెయిటింగ్ తప్పదా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  తన తొలి సినిమా, అ…ఆ తప్పితే మిగిలిన అన్ని చిత్రాలు కూడా స్టార్ హీరోలతోనే చేసాడు. మహేష్ బాబుతో రెండు సార్లు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో మూడు సార్లు సినిమాలు చేసిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో రెండో సారి సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

ఇదిలా ఉంటే రామ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఉంటుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్, ఇప్పుడు రెడ్ చిత్రాన్ని చేసాడు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్ తో సినిమాపై కామెంట్ చేసాడు రామ్.

- Advertisement -

మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. ఇదివరకే ఒకసారి చర్చించాం. అయితే అది ఎప్పుడు ఉంటుంది అన్నది తెలీదు అన్న తరహాలో మాట్లాడాడు రామ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ కాంబినేషన్ లో సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All