
ప్రస్తుతం ఫోకస్ అంతా కూడా సంక్రాంతి సినిమాలపైనే ఉంది. జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుండగా, జనవరి 12న భీమ్లా నాయక్ పోటీలో నిలిచింది. ఇక జనవరి 14న రాధే శ్యామ్ విడుదల కానున్నట్లు ప్రకటన వచ్చింది. మూడు భారీ సినిమాలు ఇంత తక్కువ గ్యాప్ లో రావడంపై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ ప్యాన్ ఇండియన్ చిత్రాలు కాబట్టి వాటి రిలీజ్ డేట్లను మార్చడం దాదాపు అసాధ్యం. కాబట్టి అందరూ కలిసి భీమ్లా నాయక్ విడుదల తేదీని వాయిదా వేయించడం కోసం కష్టపడుతున్నారు.
అయితే బీమ్లా నాయక్ టీమ్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. తాము రిలీజ్ డేట్ ను ఎప్పుడో ప్రకటించామని ఇప్పుడు వాయిదా వేసే ప్రశ్న లేదు అన్నది వాళ్ళ వాదన. వీటి మధ్యలో ఇప్పుడు ఎస్ ఎస్ రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే వారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను ఎస్ ఎస్ రాజమౌళి మీట్ అవుతాడని, భీమ్లా నాయక్ ను వాయిదా వేయమని స్వయంగా రిక్వెస్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత భీమ్లా నాయక్ విడుదల విషయంలో ఏమైనా వెనక్కి తగ్గుతారేమో చూడాలి. అయితే అంతకంటే ముందు త్రివిక్రమ్ ను దానయ్య, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు కలవనున్నారు.