Homeగాసిప్స్భీమ్లా నాయక్ నుండి నాగ్ కు హింట్ అందిందా?

భీమ్లా నాయక్ నుండి నాగ్ కు హింట్ అందిందా?

భీమ్లా నాయక్ నుండి నాగ్ కు హింట్ అందిందా?
భీమ్లా నాయక్ నుండి నాగ్ కు హింట్ అందిందా?

ఈసారి సంక్రాంతి రేసు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న, రాధే శ్యామ్ జనవరి 12న విడుదల కానున్నట్లు అధికారికంగా తెలియజేసారు. మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటను మొదట జనవరి 13న విడుదల చేస్తున్నట్లు తెలిపినా ఇప్పుడు ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. ఇదే దారిలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వెళ్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

ప్రస్తుతానికైతే భీమ్లా నాయక్ నిర్మాతలు తమ చిత్రం ముందు ప్రకటించినట్లుగానే జనవరి 12న వస్తుందని చెబుతున్నారు కానీ చివరికి వాయిదా వేయక తప్పదని సమాచారం. ఇప్పటికే అక్కినేని నాగార్జునకు ఈ విషయంలో హింట్ అందిందనే వార్త మొదలైంది. భీమ్లా నాయక్ వెనక్కి వెళ్ళింది కాబట్టే నాగ్ సినిమా బంగార్రాజును సంక్రాంతి రేసులోకి తీసుకొస్తున్నాడు నాగ్.

- Advertisement -

భీమ్లా నాయక్ కూడా ఉంటే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లతో పోటీ పడే సాహసం చేయడు. ఇప్పుడు భీమ్లా నాయక్ తప్పుకుంటుంది కాబట్టి బంగార్రాజును పోటీలో ఉంచుతున్నాడు. ఈరోజే బంగార్రాజు మొదటి పాట విడుదలైంది. అలాగే మైసూర్ లో తాజా షెడ్యూల్ మొదలైంది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All