Homeన్యూస్ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్.. ఆ కాలానికి సెట్ అవ్వుద్దా?

ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్.. ఆ కాలానికి సెట్ అవ్వుద్దా?

ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్.. ఆ కాలానికి సెట్ అవ్వుద్దా?
ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్.. ఆ కాలానికి సెట్ అవ్వుద్దా?

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ ను జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీనికి తగ్గట్లుగా ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే దోస్తీ ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేయగా దానికి ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండో సాంగ్ నాటు నాటు ను విడుదల చేయబోతున్నారు. ఈరోజు సాంగ్ ప్రోమో విడుదల చేయగా రేపు ఫుల్ సాంగ్ ను వదులుతారు.

సాంగ్ ప్రోమో చూస్తుంటే ఇది 1920ల కాలానికి చెందిన పాటగా మాత్రం అనిపించట్లేదు. ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి మొదటి నుండి ఉన్న బజ్ ఏంటంటే ఈ చిత్రాన్ని పునర్జన్మల కాన్సెప్ట్ తో ఈ కాలంతో మొదలుపెట్టి ఆ కాలానికి తీసుకెళ్లారని. ఒకవేళ అదే నిజమా? లేకపోతే నాటు నాటు ప్రోమో 1920ల కాలానికి సంబంధించిన పాటే అయితే మాత్రం అది ఎలా సింక్ అవుతుంది అన్నది మాత్రం ఆలోచించాలి.

- Advertisement -

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు. ఆర్ ఆర్ ఆర్ గ్లిమ్ప్స్ కు విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. మరి చూడాలి దీనికి సంబంధించిన క్లారిటీ త్వరలో వస్తుందేమో.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All