Homeన్యూస్రాధే శ్యామ్ మ్యూజిక్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు?

రాధే శ్యామ్ మ్యూజిక్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు?

రాధే శ్యామ్ మ్యూజిక్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు?
రాధే శ్యామ్ మ్యూజిక్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానున్న విషయం తెల్సిందే. అప్పటిదాకా పోస్టర్ లతో కాలక్షేపం చేసిన రాధే శ్యామ్ టీమ్ రీసెంట్ గా ఒక టీజర్ ను విడుదల చేసారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా రాధే శ్యామ్ నుండి ఒక్క సాంగ్ కూడా విడుదల కాకపోవడం గమనార్హం.

ఈరోజుల్లో ఏదైనా సినిమా ఫాస్ట్ గా ప్రజల్లోకి చొచ్చుకుపోవాలంటే పాటలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. అల వైకుంఠపురములో వంటి సినిమాలకు సాంగ్స్ హిట్ అవ్వడం ఎంత ప్లస్ అయిందో మనం చూసాం. విడుదల దగ్గరపడుతున్న కొన్ని చిత్రాలు పాటలను రిలీజ్ చేస్తూ తమ చిత్రాలను ప్రేక్షకులకు దగ్గరగా తీసుకెళుతున్నారు.

- Advertisement -

పుష్ప ది రైజ్ నుండి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. భీమ్లా నాయక్ నుండి రెండు పాటలు వచ్చాయి. కానీ రాధే శ్యామ్ ఈ విషయంలో ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. త్వరలోనే సాంగ్స్ కు సంబంధించిన అప్డేట్ కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాధే శ్యామ్ ప్యాన్ ఇండియా వైడ్ గా విడుదలవుతుండగా పాటలకు రెండు వెర్షన్స్ ఉన్నాయి. సౌత్ వెర్షన్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ వెర్షన్ కు మిథూన్, అమల్ మాలిక్, మనన్ భరద్వాజ్ లు సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All