Homeన్యూస్రాధే శ్యామ్: మరో టీజర్ లోడ్ అవుతోందా?

రాధే శ్యామ్: మరో టీజర్ లోడ్ అవుతోందా?

రాధే శ్యామ్: మరో టీజర్ లోడ్ అవుతోందా?
రాధే శ్యామ్: మరో టీజర్ లోడ్ అవుతోందా?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్ చిత్రానికి ప్రమోషన్స్ కరువయ్యాయి అంటూ ప్రభాస్ అభిమానులు ఎంతలా గొడవ చేసారో మనందరికీ తెల్సిందే. అయితే ఇప్పుడు రాధే శ్యామ్ టీమ్ వరస అప్డేట్స్ తో వారిని ఖుషీ చేయనుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ విడుదలైన సంగతి తెల్సిందే. విక్రమాదిత్యగా ఈ చిత్రంలో ప్రభాస్ నటిస్తుండగా ఈ టీజర్ లో ఆయన పాత్రను పరిచయం చేసారు.

హస్తసాముద్రికం ఎక్స్పర్ట్ గా ప్రభాస్ కనిపించనున్నాడు. టీజర్ లో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ కూడా ఆసక్తిని రేకెత్తించాయి. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా నవంబర్ 4న మరో అప్డేట్ రానుందని తెలుస్తోంది. ఈసారి హీరోయిన్ గా నటిస్తోన్న పూజ హెగ్డే పాత్రను పరిచయం చేస్తారట. రాధే శ్యామ్ లో ప్రభాస్ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పూజ హెగ్డే పాత్రకూ అంతే ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు.

- Advertisement -

రాధే శ్యామ్ ఒక పీరియాడిక్ లవ్ డ్రామా. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో కథ మొత్తం జరుగుతోంది. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ సినిమాకు చాలా కీలకమని అంటున్నారు. రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 14, 2022న విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. సౌత్ భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All