HomeVideosఅఖండ ట్రైలర్: మాస్ కు ఫుల్ మీల్స్

అఖండ ట్రైలర్: మాస్ కు ఫుల్ మీల్స్

అఖండ ట్రైలర్: మాస్ కు ఫుల్ మీల్స్
అఖండ ట్రైలర్: మాస్ కు ఫుల్ మీల్స్

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అంచనాలు ఆకాశాన్ని దాటతాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజండ్ చిత్రాలు ఎంతటి విజయాలు సాధించాయో మనం చూసాం. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం అఖండ. మొదటినుండి ఈ ప్రాజెక్ట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎప్పటిలానే బాలయ్య ఇందులో రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. అయితే మొదటిది నడి వయస్కుడి పాత్ర అయితే, రెండోది అఘోరా రోల్. మొదటి నుండి ఈ రోల్ పై సస్పెన్స్ ను మైంటైన్ చేస్తూ వచ్చారు.

ఇక ఈరోజు కొద్దిసేపటి క్రితం అఖండ ట్రైలర్ ను విడుదల చేసారు. అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ అదిరిపోయింది. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా కనిపిస్తోంది. ట్రైలర్ అంతటా యాక్షన్ బ్లాక్స్, పవర్ఫుల్ డైలాగ్స్ తో నిండిపోయింది. రెండు బాలయ్య పాత్రలకూ పవర్ఫుల్ డైలాగ్స్ పడ్డాయి. ఇక విలన్ పాత్రలో శ్రీకాంత్ కూడా మెప్పించేలా కనిపిస్తున్నాడు. జగపతి బాబుకు ఈ సినిమాలో భిన్నమైన పాత్ర దక్కింది.

- Advertisement -

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాలయ్య పవర్ కు తగ్గ స్థాయిలో ఉంది. మొత్తంగా అఖండ ట్రైలర్ మెప్పిస్తుంది. బోయపాటి గట్టిగా కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని అర్ధమవుతుంది. డిసెంబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది.

Also Read:

బాలయ్య – గోపీచంద్ చిత్రానికి యూఎస్ బ్యాక్ డ్రాప్?

గని ప్రపంచంలో ఉన్నది వీరే!

అఖండ రిలీజ్ డేట్ లాక్ అయినట్లేనా?

డిస్నీ+ హాట్ స్టార్ కి అఖండ..!

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All