
నందమూరి నట సింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుండి అఖండ టైటిల్ సాంగ్ రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను డిజిటల్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడైనట్టు తెలుస్తుంది. అఖండ డిజిటల్ రైట్స్ ను డిస్నీ + హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారని తెలుస్తుది.
మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్న అఖండ సినిమాకు డిజిటల్ రైట్స్ కోసం డిస్నీ + హాట్ స్టార్ మంచి ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్య తెలుగు సినిమాల కోసం డిస్నీ హాట్ స్టార్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. అమేజాన్ ప్రైం వీడియోస్, ఆహా, నెట్ ఫ్లిక్స్ లతో పాటుగా డిస్నీ హాట్ స్టార్ లో కూడా తెలుగు సినిమాలు వరుస కడుతున్నాయి.