Homeన్యూస్రన్ టైమ్ అఖండకు మైనస్ అవుతుందా?

రన్ టైమ్ అఖండకు మైనస్ అవుతుందా?

రన్ టైమ్ అఖండకు మైనస్ అవుతుందా?
రన్ టైమ్ అఖండకు మైనస్ అవుతుందా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కాంబినేషన్ లో విడుదలైన సింహా, లెజండ్ చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. సో, హ్యాట్రిక్ కాంబినేషన్ అయిన అఖండపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. టిపికల్ బోయపాటి శ్రీను సినిమాల మాదిరిగానే ట్రైలర్ కట్ ఉంది.

భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగులు, ఊర మాస్ విలన్లు, బాధల్లో ఉండే హీరోయిన్ వర్గం.. ఇలా మొత్తం బోయపాటి స్టైల్ ల్లోనే ఉంది. అలాగే బాలకృష్ణ అఘోరా గెటప్ కూడా ఆకర్షిస్తోంది. ఈ ఎపిసోడ్ చిత్రానికి ప్లస్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. బోయపాటి కూడా ఈ ఎపిసోడ్ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

- Advertisement -

ఇక తాజా సమాచారం ప్రకారం అఖండ ఫైనల్ రన్ టైమ్ లాక్ అయింది. బోయపాటి శ్రీను సినిమాల తరహాలోనే ఈ చిత్రానికి రన్ టైమ్ ఎక్కువగా ఉండనుంది. 2 గంటల 47 నిమిషాలకు ఫైనల్ రన్ టైమ్ కట్ అయింది. ఈ కాలంలో అందరూ 2 గంటల 20 నిమిషాల లోపే చిత్రాన్ని ముగించాలని చూస్తున్నారు కానీ అఖండకు ఆ రన్ టైమ్ అవసరమని బోయపాటి భావిస్తున్నాడు. అఘోరా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకంగా ఈ చిత్రంలో ఉందని సమాచారం.

ఇవి కూడా చదవండి:

‘అఖండ’తో శ్రీకాంత్ కు కొత్త లైఫ్ వస్తుందా?

అఖండ ట్రైలర్: మాస్ కు ఫుల్ మీల్స్

అఖండ రిలీజ్ డేట్ లాక్ అయినట్లేనా?

డిస్నీ+ హాట్ స్టార్ కి అఖండ..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All