Homeన్యూస్ఆచార్య ఓటిటి పార్ట్నర్ ఫిక్స్!!

ఆచార్య ఓటిటి పార్ట్నర్ ఫిక్స్!!

ఆచార్య ఓటిటి పార్ట్నర్ ఫిక్స్!!
ఆచార్య ఓటిటి పార్ట్నర్ ఫిక్స్!!

మెగాస్టార్ చిరంజీవి నుండి కొంత గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఆచార్య సినిమా రూపొందుతూ వచ్చింది. రెండు కోవిడ్ వేవ్స్ ను తట్టుకుని ఎట్టకేలకు షూటింగ్ ను కూడా పూర్తి చేసారు.

ఆచార్య ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇప్పటివరకూ ఈ చిత్రం నుండి రెండు సాంగ్స్ ను విడుదల చేసారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెల్సిందే. సిద్ధగా చరణ్ కనిపిస్తాడు. సిద్ధ టీజర్ ను నవంబర్ 28 విడుదల చేస్తారు.

- Advertisement -

ఇదిలా ఉంటే ఆచార్య డిజిటల్ పార్ట్నర్ ఎవరన్నది తెల్సింది. నిర్మాతలు ఓటిటి జైంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో డీల్ ను సెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం అమెజాన్ వారు భారీ రేటు పెట్టి కొనుగోలు చేశారట. అలాగే ఈ చిత్రాన్ని ఆరు వారాల తర్వాత ఓటిటిలో విడుదల చేస్తారని తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కు పెయిర్ గా పూజ హెగ్డే నటించింది.

ఇవి కూడా చదవండి:

ఆచార్య నుండి ‘సిద్ధ’ వచ్చేస్తున్నాడు.. చరణ్ టీజర్ కు ముహుర్తం ఫిక్స్..!

ఆచార్యను ఢీ కొట్టనున్న సూర్య

ఆచార్య సాంగ్ ప్రమోషన్స్ మళ్ళీ షురూ!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All