
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా నుండి సిద్ధ పాత్రని పరిచయం చేస్తూ ఓ టీజర్ రాబోతుందని తెలుస్తుంది. సినిమాలో సిద్ధ పాత్రలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్నారు. సిద్ధ పాత్రలో చరణ్ ఉండే కొద్దిసేపైనా అదరగొట్టేస్తాడని తెలుస్తుంది. చిరు, చరణ్ ఇద్దరు స్క్రీన్ మీద మెగా ఫ్యాన్స్ అందరిని అలరిస్తారని అంటున్నారు.
ఇక సిద్ధ టీజర్ ను నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నారు. చేతిలో తుపాకీతో కామ్రెడ్ గా మారిన సిద్ధ తన ఉగ్ర రూపం చూపించనున్నాడు. ఆచార్య నుండి ఇప్పటికే చిరు టీజర్ రిలీజై అంచనాలు పెంచగా లేటెస్ట్ గా చరణ్ టీజర్ కు రంగం సిద్ధం చేస్తున్నారు.
మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2022 ఫిబ్రవరి 4న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.