
మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ పూర్తై విడుదల కోసం ఎదురుచూస్తోంది. కొన్ని నెలల క్రితమే ఆచార్య నుండి ఫస్ట్ సాంగ్ లాహే లాహే విడుదలైంది. ఆ సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ జాప్యమవ్వడంతో ఆచార్య ప్రమోషన్స్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గా ఆచార్యను ఫిబ్రవరి 4, 2022న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే.
దీంతో ప్రమోషన్స్ తిరిగి మొదలుపెడుతున్నారు. ఆచార్య నుండి సెకండ్ సింగిల్ ను టీమ్ రిలీజ్ చేయబోతున్నారు. ఆచార్య సెకండ్ సాంగ్ నీలాంబరిను నవంబర్ 5న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ రామ్ చరణ్, పూజ హెగ్డేల మధ్య వచ్చేది. ఇందులో రామ్ చరణ్ సిద్ధాగా కనిపించనుంటే, పూజ హెగ్డే నీలాంబరిగా నటించింది. వీరిద్దరి పాత్రలు కూడా ఆచార్యకు కీలకం.
చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించింది.
A memorable melody from #Manisharma to take you back in time ?#Acharya second single #Neelambari releasing on 5th Nov at 11:07 AM ❤️#AcharyaOnFeb4th
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #NiranjanReddy @MatineeEnt @adityamusic pic.twitter.com/NVXKNLMY48
— Konidela Pro Company (@KonidelaPro) November 2, 2021