Homeటాప్ స్టోరీస్ఫలక్ నుమా దాస్ కు కుదిరిన సూపర్ డీల్

ఫలక్ నుమా దాస్ కు కుదిరిన సూపర్ డీల్

ఫలక్ నుమా దాస్ కు సూపర్ డీల్ సెట్ అయ్యింది. ఫలక్ నుమా దాస్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ 2 కోట్లకు కొనుక్కుంది. అయితే అది ఇప్పుడు కాదు సుమా ! సినిమా రిలీజ్ కి ముందే . టీజర్ , ట్రైలర్ లకు అద్భుతమైన స్పందన రావడంతో తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకంతో నెట్ ఫ్లిక్స్ 2 కోట్లకు ఫలక్ నుమా దాస్ ని కొనుక్కుంది. విడుదల కు ముందు అందునా కొత్త హీరో సినిమా ఈ రేటు పలకడం గొప్ప విషయమే.

ఇక దీనికి తోడు నైజాంలో మూడు రోజుల్లో కోటిన్నర కు పైగా షేర్ వసూల్ కావడంతో ఫలక్ నుమా దాస్ హిట్ అనే చెప్పాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ ఫలక్ నుమా దాస్ అంతగా ప్రభావం చూపించడం లేదు. ఈ ప్లాప్ టాక్ కు తోడు పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి ఈ చిత్రానికి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం పై విశ్వక్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఫలక్ నుమా దాస్ కు నెగెటివ్ గా మారాయి. అయితే విశ్వక్ సేన్ కామెంట్స్ ఫలక్ నుమా దాస్ ని ఇబ్బంది పెడుతున్నప్పటికి ఈ హీరో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. దాంతో వివాదం మరింతగా పెరుగుతుండటంతో ఎట్టకేలకు సారీ చెప్పాడు. నోటి వరకైతే సారీ చెప్పాడు కానీ ఆటిట్యూడ్ ప్రకారం అయితే తగ్గడమే లేనట్లుగా కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All