Homeటాప్ స్టోరీస్ఫలక్ నుమా దాస్ ట్రైలర్ టాక్

ఫలక్ నుమా దాస్ ట్రైలర్ టాక్

Falaknuma Das movie trailer talkవిశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఫలక్ నుమా దాస్ . పెళ్లిచూపులు డైరెక్టర్ దాస్యం తరుణ్ భాస్కర్ పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించిన ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. ఫక్తు ఓల్డ్ సిటీ స్లాంగ్ లో తెరకెక్కిన ఈ ఫలక్ నుమా దాస్ ట్రైలర్ చూస్తుంటే సినిమా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఊర మాస్ డైలాగ్స్ తో యాక్షన్ సన్నివేశాలతో సాగింది ఫలక్ నుమా దాస్ ట్రైలర్.

 

- Advertisement -

కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్ లుగా ప్రశాంతి , సలోని , హర్షిత లు నటించారు. పెళ్లిచూపులు వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. యువతకు నచ్చే అన్ని అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ వివాదాన్ని రాజేసేలా ఉన్నాయి. లం…. కొడకా, గు…పగల్దే…. నమా , దే…… యాండ్రా  లాంటి కొన్ని బూతు డైలాగ్స్ ఉన్నాయి. అయితే సినిమాలో ఈ డైలాగ్స్ ఉంటాయా ? మ్యూట్ అవుతాయా ? అన్నది చూడాలి. మొత్తానికి తెలంగాణ స్లాంగ్ లో అందునా పక్కా  హైదరాబాద్ కథతో తెరకెక్కిన ఫలక్ నుమా దాస్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిందే.

 

English Title: Falaknuma Das trailer talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All