Homeటాప్ స్టోరీస్ఫలక్ నుమా దాస్ హీరో సంచలన వ్యాఖ్యలు

ఫలక్ నుమా దాస్ హీరో సంచలన వ్యాఖ్యలు

ఫలక్ నుమా దాస్ చిత్రంలో నటించిన విశ్వక్ సేన్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి . నిన్న మొన్నటి వరకు టీజర్ , ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేయగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక విశ్వక్ సేన్ మాట్లాడుతున్న తీరు సంచలనం సృష్టిస్తోంది . ఫలక్ నుమా దాస్ హీరో వర్సెస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అన్నట్లుగా సాగుతోంది సోషల్ మీడియాలో వార్ .

- Advertisement -

ఫలక్ నుమా దాస్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల హోర్డింగ్ లను , ఫ్లెక్షీ లను ఏర్పాటు చేయించాడు ఈ హీరో అయితే ఆ హోర్డింగ్స్ ని ఫ్లెక్షీ లను పీకి పడేసారు కొంతమంది , అయితే ఆ పని చేసింది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనే ప్రచారం సాగుతోంది దాంతో సహజంగానే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు విశ్వక్ సేన్ కు గొడవ జరుగుతోంది . అయితే ఇది మరింతగా డ్యామేజ్ జరుగుతుండటంతో మీడియా ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ సారీ చెప్పాడు . నేను ఎవరినీ విమర్శించలేదు కానీ నేను బాధలో అన్న ఓ విషయాన్నీ తీసుకువచ్చి ఫలానా హీరో కు ఆపాదించడం ఏంటి ? అలాగే మీడియా సంస్థ ని కానీ రివ్యూ రైటర్ ని కానీ విమర్శించలేదు అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు . కోట్ల కొద్దీ డబ్బులు పెట్టి సినిమా తీసి అది ప్లాప్ అంటే నష్టంతో పాటుగా బాధపడతారు కూడా కదా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All