
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఫలక్ నుమా దాస్ . దాస్యం తరుణ్ భాస్కర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్ర ట్రైలర్ ని ఈరోజు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసాడు. ఇప్పటికే టీజర్ తో సంచలనం సృష్టించిన ఫలక్ నుమా దాస్ తాజాగా ట్రైలర్ తో భారీ అంచనాలను పెంచింది . పూర్తిగా మాస్ కు బాస్ లా ఉన్న ఈ ట్రైలర్ యూత్ టెంపర్ మెంట్ ఏందో సూపెట్టింది .
విశ్వక్ సేన్ ఇంతకుముందు కూడా హీరోగా నటించాడు అయితే కమర్షియల్ హిట్ కొట్టలేదు కానీ ఈ ఫలక్ నుమా దాస్ చిత్రంతో మాత్రం సూపర్ హిట్ కొట్టినట్లే కనబడుతున్నాడు . మరో రెండు రోజుల్లో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది అధికారికంగా ప్రకటించనున్నారు . సినిమా మొత్తం రెడీ ఇక రిలీజ్ కావడమే తరువాయి . అయితే అది ఎప్పుడు అన్నది మాత్రం నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ప్రకటించనున్నారు . ఎందుకంటే ఆయనే కదా రిలీజ్ చేస్తోంది .
- Advertisement -