Homeన్యూస్సుమంత్ ఎదురుచూస్తోన్న సక్సెస్ ఈ చిత్రంతోనైనా దక్కుతుందా?

సుమంత్ ఎదురుచూస్తోన్న సక్సెస్ ఈ చిత్రంతోనైనా దక్కుతుందా?

సుమంత్ ఎదురుచూస్తోన్న సక్సెస్ ఈ చిత్రంతోనైనా దక్కుతుందా?
సుమంత్ ఎదురుచూస్తోన్న సక్సెస్ ఈ చిత్రంతోనైనా దక్కుతుందా?

ఎప్పుడో 1999లో హీరోగా అరంగేట్రం చేసాడు సుమంత్. హీరోగా తన ప్రయాణం మొదలుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తయినా కూడా ఇప్పటికీ తనకంటూ స్థిరమైన మార్కెట్ ను ఏర్పరుచుకోలేకపోయాడు. అడపాదడపా అప్పుడప్పుడూ వచ్చే విజయాలే కానీ సుమంత్ నుండి కన్సిస్టెంట్ గా విజయాలు మాత్రం రాలేదు. సత్యంతో సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ హిట్ కొట్టడానికి చాలా కాలమే పట్టింది. గోదావరి సినిమాతో మరోసారి సెట్ అయినట్లే కనిపించాడు. మళ్ళీ మాములే.

2017లో మరోసారి మళ్ళీ రావా చిత్రంతో సక్సెస్ ను సాధించాడు. ఈ చిత్రానికి చాలా మంచి పేరొచ్చింది. కానీ ఈ సినిమా తర్వాత చేసిన సుబ్రహ్మణ్యపురం, ఇదమ్ జగత్, కపటదారి చిత్రాలు డిజాస్టర్ రిజల్ట్స్ ను అందుకున్నాయి. వరస ఫెయిల్యూర్స్ వస్తోన్నా కూడా సుమంత్ సినిమాల లైనప్ మాత్రం బాగానే ఉంటోంది. సుమంత్ నుండి అనగనగా ఒక రౌడీ, మళ్ళీ మొదలైంది చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

- Advertisement -

ఇదిలా ఉంటే సుమంత్ మరో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. నిన్ననే ప్రారంభోత్సవం చేసుకున్న ఈ చిత్రం పేరు అహం రీబూట్. వింటుంటే కొత్తగా అనిపిస్తోన్న టైటిల్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథకి సెట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా సుమంత్ ఆశించిన సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఒక్కసారికి బుద్ధి రాలేదా సుమంత్ : రామ్ గోపాల్ వర్మ

దుల్కర్ సినిమాలో సుమంత్ కీ రోల్?

సుమంత్ ప్రొడ్యూస‌ర్‌..ఎం.ఎస్‌. రాజు డైరెక్ట‌ర్‌!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All