Homeటాప్ స్టోరీస్సుమంత్ ప్రొడ్యూస‌ర్‌..ఎం.ఎస్‌. రాజు డైరెక్ట‌ర్‌!

సుమంత్ ప్రొడ్యూస‌ర్‌..ఎం.ఎస్‌. రాజు డైరెక్ట‌ర్‌!

Sumanth aswin turns producer for ms raju
Sumanth aswin turns producer for ms raju

ఇటీవలే పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడైన యంగ్ హీరో సుమంత్ అశ్విన్ కొత్త జ‌ర్నీని స్టార్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. నిర్మాత‌గా కొత్త కెరీర్‌ని మొద‌లుపెడుతున్నాడు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ను మ‌ళ్లీ ట్రాక్‌లోకి తీసుకురాబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిర్మాతగా సుమంత్ నిర్మించ‌బోతున్న‌ తొలి చిత్రాన్ని ఎంఎస్ రాజు దర్శకత్వం వహించబోతున్నాడు.

ఇటీవలే `డర్టీ హరి`తో దర్శకుడిగా మంచి హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న ఎం.ఎస్‌. రాజు ఈ మూవీ అందించిన స‌క్సెస్ జోష్‌తో మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు స్వయంగా కథ అందిస్తున్నారు. చాలా బాగా వ‌చ్చింద‌ని తెలిసింది. ఈ చిత్రానికి ‘7 డేస్ 6 నైట్స్’ అని పేరు పెట్టారు. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్క‌నున్న  ఈమూవీతో మ‌ళ్లీ ఎం.ఎస్‌. రాజు యూత్‌ని టార్గెట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

ఎంఎస్ రాజు ఈ చిత్రంతో కొత్త సంగీత దర్శకుడిని ప‌రిచ‌యం చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాతో పాటు అత‌నితో మొత్త్ మూడు చిత్రాల‌కు అగ్రిమెంట్ చేసుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలో లాంఛనంగా ప్రారంభించ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పిణ‌లో ఎబిజి క్రియేషన్స్ సహకారంతో వైల్డ్ హనీ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All