Homeటాప్ స్టోరీస్దుల్కర్ సినిమాలో సుమంత్ కీ రోల్?

దుల్కర్ సినిమాలో సుమంత్ కీ రోల్?

దుల్కర్ సినిమాలో సుమంత్ కీ రోల్?
దుల్కర్ సినిమాలో సుమంత్ కీ రోల్?

సుమంత్ కెరీర్ ఎప్పుడూ ఒడిదుడుకులతోనే సాగింది. ఒక హిట్ తర్వాత 2-3 సినిమాలు ప్లాప్ అవ్వడంతో సుమంత్ కెరీర్ పైకి సాగలేదు. 2017లో మళ్ళీ రావాతో హిట్ కొట్టాక మళ్ళీ సుమంత్ కు హిట్ రాలేదు. ప్రస్తుతం 2 సినిమాల్లో హీరోగా చేస్తోన్న సుమంత్ క్యారెక్టర్ పాత్రలకు సై అన్నట్లు తెలుస్తోంది.

దుల్కర్ సల్మాన్ డైరెక్ట్ తెలుగు చిత్రం చేస్తోన్న విషయం తెల్సిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో 1964 బ్యాక్ డ్రాప్ లో సాగే ఆర్మీ – లవ్ స్టోరీలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ స్నేహితుడిగా కీలక పాత్రలో సుమంత్ నటించనున్నాడని తెలుస్తోంది. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్, స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ సెట్ వేసి కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

- Advertisement -

మున్ముందు ఇలాంటి పాత్రలు మరిన్ని సుమంత్ చేసే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All