Homeగాసిప్స్నాని సినిమానే దుల్కర్ తో తెరకెక్కిస్తున్నారా?

నాని సినిమానే దుల్కర్ తో తెరకెక్కిస్తున్నారా?

నాని సినిమానే దుల్కర్ తో తెరకెక్కిస్తున్నారా?
నాని సినిమానే దుల్కర్ తో తెరకెక్కిస్తున్నారా?

హను రాఘవపూడి తర్వాతి చిత్రంపై నిన్న అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెల్సిందే. మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా స్వప్న సినిమాస్ ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించనుంది. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో 1964 టైం లైన్ లో సాగే కథ ఇదని ఫస్ట్ లుక్ లోనే హింట్ ఇచ్చారు. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అని ఈ సినిమా పాయింట్ ను కూడా చెప్పారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గతంలో హను.. నానితో చేద్దామనుకున్న సినిమానే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి గతంలో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రం చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో వెంటనే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో కథ ఇదని, దాన్ని చేయడానికి చాలా సమయం వెచ్చించాల్సి ఉందని, తన దగ్గర అంత సమయం లేదని తర్వాత అధికారికంగానే చెప్పాడు నాని. ఇప్పటికే న్యాచురల్ స్టార్ మూడు సినిమాలకు కమిటై బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడు అదే కథకు మార్పులు చేర్పులు చేసి దుల్కర్ తో హను తెరకెక్కించనున్నాడా అన్న రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All