HomeINTERVIEWSనేను రీమేక్స్‌కి వ్య‌తిరేకిని- దుల్క‌ర్ స‌ల్మాన్‌

నేను రీమేక్స్‌కి వ్య‌తిరేకిని- దుల్క‌ర్ స‌ల్మాన్‌

నేను రీమేక్స్‌కి వ్య‌తిరేకిని- దుల్క‌ర్ స‌ల్మాన్‌
నేను రీమేక్స్‌కి వ్య‌తిరేకిని- దుల్క‌ర్ స‌ల్మాన్‌

దిగ్రేట్ డైరెక్టర్ మణిరత్నం  దర్శకత్వం వహించిన `ఓకే బంగారం`, సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన `మహానటి` వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం `కన్నుమ్ కన్నుమ్ కల్లైయాడితల్`. `పెళ్లిచూపులు` ఫేమ్ రితూవర్మ కథానాయికగా నటించింది.  దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్నితెలుగులో `కనులు కనులను దోచాయంటే` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని కేఎఫ్సీ ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా
హీరో దుల్కర్ సల్మాన్ గురువారం (28) మీడియాతో ముచ్చటించారు.

మీరు ఎక్కువగా ద్విభాషా చిత్రాలకే ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్టున్నారు?
ఇలాంటి ప్ర‌శ్న న‌న్ను చాలా మంది రెగ్యుల‌ర్‌గా అడుగుతున్నారు. అలా అని ఏమీ లేదు. ద్విభాషా చిత్రాలు చేయాల‌ని నేను ప్ర‌త్యేరంగా ప్లాన్ చేసుకోవ‌డం లేదు. నాకు న‌చ్చిన క‌థ‌ల్ని చేసుకుంటూ వెళుతున్నాను. కొన్ని క‌థ‌లు అంద‌రికి క‌నెక్ట్ అవుతున్నాయి. అలా అందరికి క‌నెక్ట్ అయ్యే సినిమా `క‌నులు క‌నుల‌ను దోచాయంటే`. తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అవుతుంది.

- Advertisement -

Dulquer Salmaan interview

`మ‌హాన‌టి` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు?
అవును. ఈ చిత్రంలో నా పాత్ర‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకున్నాను కూడా. ఈ సినిమా విడుద‌లైన అన్ని భాష‌ల్లో నాకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులోనే చూడండ‌ని చాలా మందికి
చెప్పాను.

ఇన్ని భాష‌ల్లో ఎలా సినిమాలు చేయ‌గ‌లుగుతున్నారు?
నాకు లాంగ్వేజ్ బేరియ‌ర్స్ అనేవి లేవు. నా ద‌గ్గ‌రికి వ‌చ్చిన సినిమాలు చేస్తున్నాను.
య‌ల‌యాళంతో పాటు ఇంగ్లీష్‌, త‌మిళ్‌, హిందీ మాట్లాడ‌తాను. తెలుగులో మాత్రం స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడ‌గ‌ల‌ను. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగులో కొన్ని ప‌దాలు ప‌ల‌క‌డం చాలా ఇష్టం. కొన్ని ఉర్దూ ప‌దాలంటే కూడా ప‌ల‌క‌డానికి ఇష్ట‌ప‌డుతుంటాను.

`క‌నులు క‌నుల‌ను దోచాయంటే` సినిమా గురించి ఏం చెబుతారు?
ఇదొక రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌. సినిమాలో మంచి ల‌వ్‌స్టోరీ వుంది. అలాగే కొన్ని థ్రిల్లింగ్ అంశాలు కొత్త‌గా అనిపిస్తాయి. తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అవుతుంది. ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. చాలా మంది ట్రైల‌ర్ గురించి పాజిటివ్‌గా కామెంట్స్ చేశారు. అలాగే సాంగ్స్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఒక సినిమాని అంగీక‌రించాలంటే ఏ అంశాల్ని ప్ర‌ధానంగా చూస్తారు?
గుడ్ స్క్రిప్ట్‌. స్క్రిప్ట్ బాగుంటేనే కాదా అవుట్ పుట్ కూడా ప‌ర్‌ఫెక్ట్‌గా వ‌స్తుంది. అలాంటి క‌థ‌ల‌కే అధిక ప్రాథాన్య‌త‌నిస్తుంటాను. నేను రీమేక్స్‌కి వ్య‌తిరేకిని. మ‌నం చూసే సినిమా కొత్త‌గా వుండాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాను. అంతే కాకుండా ద‌ర్శ‌కుడిపై వున్న న‌మ్మ‌కాన్ని బ‌ట్టి ఆ సినిమా అంగీకరించాలా లేదా అని నిర్ణ‌యించుకుంటుంటాను.

మ‌ళ్లీ తెలుగు సినిమా ఎప్పుడు చేయ‌బోతున్నారు?  
స్ట్రైట్ తెలుగు సినిమా ఈ ఏడాది చివ‌ర‌లో చేసే అవ‌కాశం వుంది. ఎవ‌రితో వంటి వివ‌రాలు నిర్మాణ సంస్థ చెబితేనే బాగుంటుంది. అంత‌కు మించి వివ‌రాలు ఇప్పుడే వెల్ల‌డించ‌లేను.

ప్ర‌స్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు?
మూడు చిత్రాల్లో న‌టిస్తున్నాను. అవి షూటింగ్ ద‌శ‌లో వున్నాయి. ఈ ఏడాది మొత్తం షూటింగ్‌తోనే గ‌డ‌ప‌బోతున్నాను. నా షెడ్యూలింగ్ అలా వుంది. దీనికి నా కుటుంబ స‌భ్యులు కూడా స‌హ‌క‌రిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All