
అక్కినేని హీరో సుమంత్ ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు. 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్న సుమంత్, 2006లో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుండి సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నాడు. పెళ్లి గురించి అడిగినా కూడా ఇక వద్దు అన్నట్లుగా చెప్పే సుమంత్ ఇప్పుడు మరో పెళ్ళికి సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. సుమంత్ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్ కే చెందిన పవిత్రను సుమంత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అక్కినేని ఫ్యామిలీతో పాటు అతికొద్ది మాత్రమే అటెండ్ అయ్యే ఈ వెడ్డింగ్ ఫంక్షన్ త్వరలోనే జరగనుంది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ఈ న్యూస్ పై స్పందించాడు. “ఒక్కసారి అయ్యాక కూడా నీకు బుద్ధి రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ, అనుభవించండి” అని తన స్టైల్ లో ట్వీటాడు.
ప్రస్తుతం సుమంత్ నటించిన అనగనగా ఒక రౌడీ విడుదలకు సిద్ధంగా ఉంది.
Oka saari ayyaka kooda neekinkaa buddhi raaledha @iSumanth ? Nee kharma , aa pavitra kharma???? Anubhavinchandi ???? pic.twitter.com/cfg2Zs5npg
— Ram Gopal Varma (@RGVzoomin) July 28, 2021
Oka pelle noorella penta ayithe, rendo pellentayya Swami ? Naa maata vini maneyyi ..Pavitra gaaru, mee jeevithaalani paadu chesukokandi..Thappu meedhi @iSumanth dhi kaadhu ..Thappu aa dhaurbhagyapu vyavasthadi pic.twitter.com/DUJKRQuiC6
— Ram Gopal Varma (@RGVzoomin) July 28, 2021