Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ కేసిఆర్ చేతిలో కీలు బొమ్మనా ?

పవన్ కళ్యాణ్ కేసిఆర్ చేతిలో కీలు బొమ్మనా ?

Pawan-kalyan-in-kcr-hand--mahakootamiప్రశ్నిస్తానంటూ జనసేన అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన పవన్ కళ్యాణ్ కేసిఆర్ చేతిలో కీలు బొమ్మలా మారాడు అని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు . మోడీ కి కేసిఆర్ ల చేతిలో కీలు బొమ్మలా మారి రాజకీయం చేస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు . ఇందుకు ఉదాహరణగా తెలంగాణ లో దొరల పాలన , గడీల పాలన కొనసాగుతున్నప్పటికీ కేసిఆర్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు పవన్ కళ్యాణ్ పైగా కేసిఆర్ ని కలిసి ప్రశంసల వర్షం కూడా కురిపించాడు జనరంజకమైన పాలన కేసిఆర్ అందిస్తుస్తున్నాడని . ఇక తాజాగా తెలంగాణలో ఎన్నికలు సమీపించాయి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ ఎన్నికల గురించి అస్సలు పట్టించుకోలేదు సరికదా , ఎన్నికలు లేని ఆంధ్రప్రదేశ్ లో రోడ్ షోలు చేస్తూ కాలయాపన చేస్తున్నాడు .

తెలంగాణ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించగలడు పవన్ కానీ ఆ ప్రభావం టిఆర్ఎస్ కు కలిసి వచ్చేలా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట . తెలంగాణ ఎన్నికల గురించి ఆలోచించలేదు కాకపోతే రెండు , మూడు రోజుల్లోనే ఓ నిర్ణయం తీసుకుంటానని అంటున్నాడు పవన్ కళ్యాణ్ . ప్రశ్నిస్తా అంటూ జనసేన పెట్టిన పవన్ చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం పై కానీ కేసిఆర్ ప్రభుతం పై కానీ అస్సలు ఆరోపణలు చేయడం లేదు , విమర్శించడం లేదు . దాంతో కేసిఆర్ , మోడీ లకు తొత్తుగా మారాడని సంచలన ఆరోపణలు చేస్తున్నారు తెలుగు దేశం , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు .

- Advertisement -

English Title: Pawan kalyan in kcr hand : mahakootami

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All