Homeటాప్ స్టోరీస్జనసేన తరుపున పోటీ చేయనున్న నాగబాబు ?

జనసేన తరుపున పోటీ చేయనున్న నాగబాబు ?

Will nagababu contest in denduluru from janasenaమెగా బ్రదర్ నాగబాబు జనసేన తరుపున వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తరుపున దెందులూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చింతమనేని ప్రభాకర్ పై పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు. చింతమనేని ప్రభాకర్ గతకొంత కాలంగా పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు దాంతో అతడిపై ఆగ్రహంగా ఉన్న పవన్ అతడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే పవన్ వార్నింగ్ కి సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్. పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే నాపై పోటీ చెయ్ అంటూ సవాల్ విసిరాడు దాంతో పవన్ కళ్యాణ్ అహం దెబ్బతింది.

దాంతో దెందులూరు అసెంబ్లీ స్థానం నుండి రాబోయే ఎన్నికల్లో అన్నయ్య నాగబాబు ని పోటీకి నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడాట పవన్ . ప్రస్తుతం పోటీ చేయించాలన్న దిశగా ఆలోచనలు చేస్తున్నాడు పవన్ అయితే దానికి నాగబాబు ఒప్పుకోవాలి. ప్రస్తుతం నాగబాబు జబర్దస్త్ తో బిజీగా ఉన్నాడు. అలాగే రాజకీయాల పట్ల కూడా ఆసక్తిగా ఉన్నాడు. తమ్ముడికి అండగా ఉండాలని డిసైడ్ అయ్యాడట కానీ పోటీ విషయంలో మాత్రం నిర్ణయించుకోలేదు నాగబాబు . అయితే పవన్ కళ్యాణ్ పట్టుబట్టితే మాత్రం నాగబాబు దెందులూరు నుండి రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. చింతమనేని ప్రభాకర్ ని ఓడించాలని పవన్ కంకణం కట్టుకున్నాడు మరి. తెలుగుదేశం పార్టీని మట్టికరిపించాలని కసిగా ఉన్నాడు పవన్ , గత ఎన్నికల్లో తెలుగుదేశం కు మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పుడు మాత్రం బాబు అన్నా …. తెలుగుదేశం పార్టీ అన్నా సహించలేకపోతున్నాడు.

- Advertisement -

English Title: Will nagababu contest in denduluru from janasena ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All