Homeటాప్ స్టోరీస్జనసేనలోకి ప్రభాస్ పెద్దనాన్న

జనసేనలోకి ప్రభాస్ పెద్దనాన్న

 Actor krishnamraju eyes on pawans janasenaపవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు చేరనున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి . భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు కృష్ణంరాజు . గతంలో భారతీయ జనతా పార్టీ తరుపున గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసాడు అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం లో చేరాడు . ఆ తర్వాత ప్రజారాజ్యం తరుపున పోటీచేసి చిత్తుగా ఓడిపోయాడు , దాంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కట్ చేస్తే దేశం మొత్తం భాజపా గాలి వీయడంతో మోడీ ప్రధాని అయ్యాడు దాంతో మళ్ళీ భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు , అంతేకాదు ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం ఖాయం అని కూడా వార్తలు వచ్చాయి కానీ నాలుగేళ్లు గడిచినా కృష్ణంరాజు కు పదవి రాలేదు దాంతో జనసేన వైపు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది .

అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు ఉండవు అని , ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఏపీ ప్రజలు బిజెపి పై ఆగ్రహంగా ఉన్నారు దాంతో జనసేన తరుపున పోటీ చేయాలని భావిస్తున్నాడట . అయితే ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా ? అన్న డైలమాలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఏపీలో పవన్ జనసేనకు పెద్దగా ఓట్లు రావని , అలాగే సీట్లు కూడా కష్టమే అని సర్వేలు తేల్చి చెబుతున్నాయి మరి . ఎన్నికల సమయానికి ఎలా ఉంటుందో పరిస్థితి చూడాలి .

- Advertisement -

English Title: Actor krishnamraju eyes on pawans janasena

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All