Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ జెన్యూన్ కాదంటున్న నటుడు

పవన్ కళ్యాణ్ జెన్యూన్ కాదంటున్న నటుడు

Dr. bharath reddy sensational comments on pawan kalyanపవన్ కళ్యాణ్ జెన్యూన్ కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి . పవన్ కళ్యాణ్ తో కలిసి అత్తారింటికి దారేది చిత్రంలో నటించాడు డాక్టర్ భరత్ రెడ్డి . ప్రణీత కు జోడీగా నటించిన వ్యక్తి ఈ భరత్ రెడ్డి , కాగా అత్తారింటికి దారేది చిత్రం మాత్రమే కాకుండా దాదాపు 70 చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించాడు ఈ నటుడు . అయితే తాజాగా ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు . పవన్ కళ్యాణ్ ని చాలామంది అదేపనిగా పొగుడుతూ అతడి దృష్టిలో అలాగే పవన్ అభిమానుల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారని నాకు అది నచ్చదని అనేశాడు .

- Advertisement -

నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ని అదేపనిగా పొగడలేదని , అలాగే పవన్ కళ్యాణ్ చెబుతున్నదంతా కూడా నిజం కాదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు . పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించి ప్రశ్నించడానికి వచ్చానంటూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే . దాంతో పవన్ నిజాయితీ పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నాడు డాక్టర్ భరత్ రెడ్డి . ప్రస్తుతం ఈ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు పాత్రలో నటిస్తున్నాడు . పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ డాక్టర్ భరత్ రెడ్డిని ట్రోల్ చేయడం ఖాయం .

English Title: Dr. bharath reddy sensational comments on pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts