Homeటాప్ స్టోరీస్ఆత్మహత్య చేసుకున్న మహేష్ అభిమాని

ఆత్మహత్య చేసుకున్న మహేష్ అభిమాని

mahesh babu fan commits suicideసూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది . ఒకవైపు భరత్ అనే నేను చిత్రం సంచలనం సృష్టిస్తున్న ఈ సమయంలో మహేష్ అభిమాని సూసైడ్ చేసుకోవడం సంచలనమే అయ్యింది . గుంటూరు కి చెందిన పులి సునందకుమార్ రెడ్డి హైదరాబాద్ లో సి ఎస్ డి చదువుతున్నాడు . తీవ్ర మానసిక ఒత్తిడి కి గురైన మహేష్ ఫ్యాన్ సునందకుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు . అయితే చనిపోయే ముందు రెండు సూసైడ్ లేఖ లను రాసాడు . అందులో ఒకటి తల్లిదండ్రులకు కాగా మరో లెటర్ మహేష్ బాబు కు రాయడం విశేషం .

అయితే ఎప్పుడైనా తీవ్ర నిరాశగా ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమాలు చూసి ఆత్మస్థైర్యాన్ని పొందుతానని కూడా సూసైడ్ నోట్ లో రాసాడు . మహేష్ అంటే పడిచచ్చే సునందకుమార్ మహేష్ నటించిన అన్ని సినిమాలను చూశాడట ! అలాగే డిప్రెషన్ లో ఉన్న సమయంలో మహేష్ సినిమా చూడటం వల్లే ధైర్యంగా ముందుకు సాగుతానని మీరే నా డాక్టర్ అంటూ లెటర్ రాయడం అందరినీ కలిచివేసింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All