తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నాడు పిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి . మేము చేసుకున్న సర్వే ప్రకారం 80 కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని అలాగే మరికొన్ని స్థానాలను కూడా కైవసం చేసుకుంటామని అంటున్నాడు అంతేనా తెలంగాణ రాష్ట్ర సమితి కి 20 స్థానాలు కూడా రావని అది సర్వేలో స్పష్టం అయ్యిందని అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి . కాంగ్రెస్ పార్టీ కేసిఆర్ ని ఓడించడానికి తెలుగుదేశం పార్టీతో జతకట్టింది అంతేకాదు మహాకుటమి పేరుతో కోదండరాం ని సైతం కలుపుకుంది . దాంతో అధికార టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పడుతున్నాయి .
మహాకుటమి లో ఇంకా పొత్తుల గోల తెగలేదు , సీట్ల కోసం పోట్లాట జరుగుతూనే ఉంది కానీ కేసిఆర్ ని ఓడించడం అన్నది అందరి లక్ష్యం కాబట్టి కూటమిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు . కేసిఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇప్పుడున్న ప్రతిపక్షాలను సైతం లేకుండా చేస్తాడని గట్టి పట్టుదలగా ఉన్నారు . కేసిఆర్ నిరంశుక వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైందని దుయ్యబట్టాడు ఉత్తమ్ కుమార్ . డిసెంబర్ లో జరగనున్న ఎన్నికల్లో అధికారం మాదంటే మాదని తెలంగాణ రాష్ట్ర సమితి , మహాకుటమి భావిస్తున్నాయి . ఇక ప్రజల తీర్పు ఎలా ఉండనుందో తెలియాలంటే డిసెంబర్ 11 వరకు ఎదురు చూడాల్సిందే .
English Title: PCC chief uttam confident on power politics